PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రాధేశ్యామ్​’కు పోటీగా ‘గంగూభాయి’

1 min read

– 30న ప్రేక్షకుల ముందు రానున్న రెండు సినిమాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్​’, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ‘గంగూభాయి’ కు మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రభాస్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్ ’ కు పోటీగా ఆలియా తన ‘గంగూబాయి’ని దించుతోంది. ఈ రెండు సినిమాలు జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రాధేశ్యామ్ హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సెక్స్‌వర్కర్ గంగూబాయి కథ ఆధారంగా ఆలియా ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న చిత్రం ‘గంగూబాయి’. ఈ సినిమా టీజర్‌కు భారీ ఆదరణ లభించింది. ఆలియా నటన, ఆమె స్టన్నింగ్ లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై‘ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 30న రాధేశ్యామ్తో పాటు ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

About Author