లాభాల్లో స్టాక్ మార్కెట్లు
1 min readస్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 0.57% లాభపడి 51070.25 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టి 50 115 పాయింట్లు లాభపడి 15097 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టి 50 వరుసగా 0.57% మరియు 0.77 % ఇంట్రాడే లో లాభపడి ముగియగా… బ్యాంక్ నిఫ్టి మాత్రం కేవలం 0.24% లాభపడి 36,539 వద్ద ముగిసింది. కేవలం 88 పాయింట్లను మాత్రమే బ్యాంక్ నిప్టి గెయిన్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది.
రేపటికి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కనుక తీసుకుంటే 36535 వద్ద గట్టి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే అనంతరం 36380 లెవెల్ వద్ద సపోర్ట్‌గా పనిచేసే పరిస్థితి ఉండవచ్చు. 36535 వద్ద కనుక బ్యాంక్ నిఫ్టి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయితే కొంత ర్యాలీ ఆశించవచ్చు.