PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయం… మాదే..

1 min read
– జీ.పీ. ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకుంటాం..– అభిమానుల మధ్య కేక్​ కట్​ చేసిన తెర్నేకల్​ సురేందర్​ రెడ్డి–...
అభిమానుల మధ్య కేక్​ కట్​ చేస్తున్న సురేందర్​ రెడ్డి

అభిమానుల మధ్య కేక్​ కట్​ చేస్తున్న సురేందర్​ రెడ్డి

– జీ.పీ. ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకుంటాం..
– అభిమానుల మధ్య కేక్​ కట్​ చేసిన తెర్నేకల్​ సురేందర్​ రెడ్డి
– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికసీట్లు కైవసం చేసుకుంటామని వైసీపీ రాష్ర్ట అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని భవ్యశ్రీ హోటల్​ దగ్గర తెర్నేకల్​ సురేందర్​ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది అభిమానుల మధ్య తెర్నేకల్​ సురేందర్​ రెడ్డి కేక్​ కట్​ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులకు తినిపించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామన్నారు. రాష్ట్రంలో తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఇందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు క్రమశిక్షణతో మెలుగుతుండటమేనన్నారు. ప్రతిపక్ష పార్టీలు … వైసీపీ విజయాన్ని భరించలేక… ఆరోపణలు చేస్తున్నారని విమర్శించిన తెర్నేకల్​ సురేంద్ర రెడ్డి… సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గ్రామపంచాయతీలలో అధిక సీట్లు విజయానికి ప్రధానకారణమన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి పాలనను ప్రజలు మరోసారి ఓటు ద్వారా అభినందించడం సంతోషించదగ్గ విషయమని, ఓటర్లందరికీ రుణపడి ఉంటామన్నారు. అభిమానుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author