వైభవంగా జ్వాలా నరసింహస్వామి ఉత్సవాలు
1 min readపల్లె వెలుగు, రుద్రవరం; మండల కేంద్రమైన రుద్రవరం లోని కుమ్మరిపేట బెస్తకాలని అమ్మవారి శాల వీధులలో మూడవ రోజు శుక్రవారం శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఉత్సవ మూర్తులు అంగరంగ వైభవంగా భక్తులతో పూజలు అందుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆహోబిలంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామాల మీదుగా ఉత్సవమూర్తుల పార్వేట నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రుద్రవరంలో మూడవ రోజు శుక్రవారం అటవీశాఖ తెలుపు పై అటవీ శాఖ అధికారులతో పూజలందుకున్న ఉత్సవమూర్తులు కుమ్మరి వీధి బెస్త కాలనీ అమ్మవారి శాల వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి ఆయా తెలుపు లపై కొలువు తీరగా భక్తులు కుటుంబ సమేతంగా ఉత్సవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పారువేట పల్లకి రెడ్డి చావిడి వద్ద కొలువు తీరగా తాసిల్దార్ వెంకట శివ ఆర్ఐలు నర్సిరెడ్డి మహబూబాష, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూల మాలలు కొబ్బరికాయలు సమర్పించగా పూజారులు పూలమాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి పారువేట పల్లకిని బోయీలు గ్రామోత్సవం నిర్వహిస్తూ మోసుకుంటూ వెళ్లగా కొల్లం వారి తెలుపుపై కొలువుదీరింది. ఉత్సవ మూర్తుల పల్లకి రాత్రి అక్కడే బస చేయడం జరుగుతుందని మళ్ళీ శనివారం ఉదయం పార్వేట గ్రామోత్సవము ప్రారంభమవుతుందని పూజారులు తెలిపారు.