వైభవంగా శివ స్వామి పడిపూజ
1 min readపల్లెవెలుగు, ఆదోని
ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో ఆదివారం మధ్యాహ్నం శివమాలదారుడు సురేష్ నివాసంలో శివస్వాములు భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించారు. గురుస్వాములు నీలకంఠేశ్వర స్వామి, లింగోజి స్వామి నేతృత్వంలో కైలాసనాథుడి చిత్రపటం వద్ద పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా గురుస్వాములు నీలకంఠేశ్వర స్వామి, లింగోజి స్వామి మాట్లాడుతూ భోళాశంకరుడిని భక్తితో పూజిస్తే .. కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నారు. స్థానిక శివాలయంలో కానీ, శివమాల గతంలో ధరించిన వారితో కానీ , గురుస్వాములతో కానీ శివమాలను ధరించవచ్చు. మాఘమాసంలో మహాశివరాత్రికి 40 రోజులతో దీక్ష ముగుస్తుందని, శ్రీశైలక్షేత్రంలో వెలిసిన మల్లికార్జన స్వామిని దర్శనం అనంతరం.. మరుసటి రోజు ( 41వ రోజు ) త్రిఫల వృక్షం వద్ద మాలను విరమింపజేసుకోవాలి. నియమనిష్టలతో దేవుడిని పూజించిన మాలధారులు..
మాఘమాసంలో మహాశివరాత్రికి లేదా కార్తీక మాసంలోమాస శివరాత్రికి మండలి పూజ పూర్తయ్యేటట్లు చూసుకోవాలన్నారు. అనంతరం భక్తిపాటలు పాడి.. భజన చేశారు. అనంతరం సేవ ( అన్నదానం) చేశారు. కార్యక్రమంలో శివస్వాములు, భక్తులు పాల్గొన్నారు.