PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం… సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం

1 min read
సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

భక్తులతో కిటకిటలాడిన దేవాలయం
పల్లెవెలుగు, కర్నూలు
స్థానిక సూర్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో పంచాయతీన హోమం చేశారు. సూర్యనారాయణ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు ముగింపు సందర్భంగా వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్​ రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వినయ్ కుమార్ శర్మ, సునీల్ కుమార్ ఆచార్యులు, అగ్రహారం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author