NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీలో టిక్కెట్ల..లొల్లి..

1 min read

– ఎమ్మెల్యే సమక్షంలోనే వాగ్వాదం..
– బీ ఫారం పంపిణీలో… ఆశావహుల అసంతృప్తి
– కర్నూలు పరిధిలో 30 బీఫారాలు అందజేత.. మూడు పెండింగ్​..
– నేడో.. రేపో.. క్లియర్ ?
పల్లెవెలుగు, కర్నూలు
మున్సిపల్​ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… వైసీపీలో అసంతృప్తి వాదులు, రెబల్స్​ సంఖ్య పెరుగుతోందనే చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తమకు కాదని… రెండుమూడేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి, ఇతర పార్టీల నుంచి సీటు కోసం వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం.. కొన్ని నెలలుగా ముభావంగా ఉన్నా… బీ ఫారాలు పంపిణీలో అసంతృప్తి వాదుల ఆక్రోశం.. ఒక్కసారిగా బయటపడింది. మంగళవారం రాత్రి వైసీపీ జిల్లా పార్లమెంట్​ అధ్యక్షుడు బీవై రామయ్య, పార్టీ ఎన్నికల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్​ రెడ్డి నేతృత్వంలో 30 మంది అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. నగరంలోని సీతారాంనగర్​, దేవనగర్​ వార్డులకు సంబంధించిన బీఫారాలు పంపిణీలో కొందరు పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నుంచి బీఫారం ఒకరికి అందజేయగా… టిక్కెట్​ ఆశించి.. భంగపడిన వారు.. ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. ఈ విషయం నగరంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొందరు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం లేదా గురువారం లోపు అన్ని వార్డుల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసే అవకాశం ఉంది. కాగా.. టిక్కెట్లు దక్కిన వారు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనగా… టిక్కెట్​ ఆశపడి.. చుక్కెదురైన వారు మాత్రం రెబల్​గా పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీకి ఇంటి పోరు తప్పదనే చెప్పవచ్చు.

About Author