స్టాక్ మార్కెట్ లో అలజడి
1 min read– ఉదయమే నిలిచిపోయిన ట్రేడింగ్
– ఆందోళనలో ట్రేడర్లు
– టెక్నికల్ సమస్య ఉత్పన్నమైనట్టు ప్రకటించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి
– సమస్య పరిష్కరిస్తామని వెల్లడి
ముంబయి : ప్రపంచంలోనే అతిపచెద్ద స్టాక్ ఎక్స్చేంజీ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో అలజడి రేగింది. ఎన్ఎస్ సీలో తలెత్తిన టెక్నికల్ సమస్యతో ఉదయం 11.40 నిమిషాల సమయంలో నిప్టి 50 మరియు బ్యాంక్ నిప్టీలు ఫ్రీజ్ అయ్యాయి. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ విభాగంలో మొత్తం ట్రేడింగ్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ట్రేడర్లు, పెట్టుబడిదారులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. అసలు స్టాక్ మార్కెట్లో ఏమైందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ప్రతి రోజు కొన్ని లక్షలకోట్ల వ్యాపారం జరిగే మార్కెట్లో ఇలా జరిగే సరికి వ్యాపారులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. అయితే, ఇది పూర్తిగా టెక్నికల్ సమస్య అని, త్వరలోనే పరిష్కరిస్తామని ఎన్ ఎస్ సీ ట్వీట్టర్ లో ప్రకటించింది. ఇప్పటికే టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడినట్టు తెలిపింది. సమస్య పరిష్కారానికి సత్వరమే ప్రయత్నిస్తామని తెలిపింది. ఎన్ ఎస్ సీ ప్రకటనతో ట్రేడర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పటిలోపు సమస్య పరిష్కారమవుతుందన్నది స్పష్టత రాలేదు. దీంతో ట్రేడర్లకు, ఇన్వెస్టెర్లకు ఎదురుచూపులు తప్పేలా లేవు.