‘హీరో’ను అన్న అని పిలిచిన ‘హీరోయిన్’
1 min readహీరో సందీప్ కిషన్ ను ‘అన్న’ అని పిలిచింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. దీంతో ఒక్కసారిగ నవ్వులు వెల్లివిరిశాయి సభికుల్లో. గత రాత్రి జరిగిన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా చిత్రికీరణ సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి చెబుతున్న సందర్భంలో లావణ్య త్రిపాఠి అప్రయత్నంగా సందీప్ కిషన్ ను ‘అన్న’ అని సంబోధించింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకున్న లావణ్య త్రిపాఠి సందీప్ తనకు ఫ్రెండ్ అని… ఫ్యాన్స్ కి అన్న అంటూ కవర్ చేసింది. వీరిద్దరు నటించిన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రం మార్చి 5న రిలీజ్ అవుతోంది.