0-5 సం।। లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి..
1 min read– జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సంవత్సరముల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమాన్ని వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందితో ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష నిర్వహించారుఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాలు వేసుకోని 0-5 సంవత్సరముల లోపల పిల్లలను , గర్భిణీలను గుర్తించి వ్యాధి నిరోధక టీకాలు వేయించడమే జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అని ఇంఛార్జి కలెక్టర్ పేర్కొన్నారు. ఆగస్టు 7 నుంచి 12 వరకు మొదటి విడతలో ఉదృత మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా రొటీన్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు నిర్వహించామని.రెండో విడతగా, సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు,మూడో విడతగాఅక్టోబర్ 9 నుంచి 14 వరకు మొత్తము మూడు విడతలో ఉదృత మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా రొటీన్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.సంబంధిత శాఖల అధికారులు అందరూ సమన్వయం తో పనిచేసి 0-2 సంవత్సరంలో టీకాలు వేసుకోకుండా వున్న పిల్లలకు,0-5 సంవత్సరంలోపల MR1,MR,DPT బూస్టర్ వేసుకొని పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి 2023 కి మీజిల్స్, రుబెల్లా లేని జిల్లా మరియు రాష్ట్రం గా తీర్చి దిద్దాలనే లక్ష్యoగా పని చేయాలని ఇంఛార్జి కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎమ్ హేచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి, ఐసిడిఎస్ ఇన్చార్జి పిడి వెంకట లక్ష్మమ్మ,సర్వజన ప్రభుత్వ వైద్యశాల డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసరావు, డెమో ప్రమీల దేవి,తదితరులు పాల్గొన్నారు.