పది పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలి:ఎంఈఓ
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతురు మండల కేంద్రంలో ఈనెల మూడవ తేదీ నుంచి ఆదర్శ పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారి పీ.మౌలాలి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ లకు ఆయన సూచించారు.శనివారం మధ్యాహ్నం ఆదర్శ పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్షలకు ఏర్పాటు చేస్తున్న వాటిని ఎంఈఓ పరిశీలించారు.పరీక్షలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి సలహాలు తెలియజేశారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు త్రాగునీరు మరియు మరుగుదొడ్లు అత్యవసరమైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేశారు.ఆదర్శ పాఠశాలలో 260 మంది విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని ఎంఈఓ తెలియజేశారు.