10 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. నిరుద్యోగులకు ఆహ్వానం !
1 min readపల్లెవెలుగువెబ్ : కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత పెరగొచ్చని తాజా సర్వే వెల్లడించింది. దేశంలో పెద్దవాళ్లు ఎక్కువగా ఉండటం, ఎక్కువమంది రిటైర్‌మెంట్‌కు దగ్గర పడుతున్నకారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో శాశ్వత నివాసితులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. మే 2022 నాటి లేబర్ ఫోర్స్ సర్వే అనేక పరిశ్రమలలో పెరుగుతున్న కార్మికుల కొరతను హైలైట్ చేసింది. 2021, మే నుండి ఖాళీల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగిందని తెలిపింది. వృత్తిపరమైన, శాస్త్రీయ , సాంకేతిక సేవలు, రవాణా , గిడ్డంగులు, ఫైనాన్స్ , భీమా, వినోదం, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ రంగంలోనూ రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి.