10 లీటర్ల నాటు సారా స్వాధీనం, ధ్వంసం..
1 min read– నాటు సారా కాచి, విక్రయించే వారిపై ఉక్కు పాదం..
– సబ్ ఇన్స్పెక్టర్ సుంకర సాయి స్వరూప్
పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : ఏలూరు జిల్లా,చింతలపూడి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధి లో గల టి. నర్సాపురం మండలం తెడ్లెం గ్రామంలో చింతలపూడి సెబ్ సిబ్బంది దాడులు జరిపి దేశవరం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి , నాటు సారాతో ప్రజల ఆరోగ్యాలను. కుటుంబ ఆర్థిక స్థితిగతులను నాశనం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, నాటు సారా కాచి, విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపుతామని ఇటువంటి వారి వివరాలు తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు, అరెస్ట్ అయిన వారుమేరుగు కళ్యాణ్ బాబు 2. కందికొండ ఏసురాజు అనే వ్యక్తులను అరెస్టు చేసిరేమల్లి సంసోను రాజునున్న రమేష్ లపై కేసు నమోదు చేసి వీరి వద్ద నుండి 10 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకోనీ 1600 లీటర్ల బెళ్లపు వూటను నెరస్తలం నందు ధ్వంసం చేయడం అయినదని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ దాడులలో చింతలపూడి సెబ్ ఇన్స్పెక్టర్ సుంకర సాయి స్వరూప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.