ఆ కంపెనీల్లో 10 శాతం జీతాలు పెంపు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్‌లోని కంపెనీలు వేతనాలను సగ టున 10 శాతం పెంచవచ్చని అంతర్జాతీయ సంస్థ విల్లీస్ టవర్స్ వాట్సన్ అంచ నా వేసింది. ఆసియా పసిఫిక్ దేశాల్లోకెల్లా ఇదే అత్యధికమని తాజా నివేదికలో పేర్కొంది. జీతాల పెంపు చైనాలో 6 శాతం, హాంకాంగ్‌లో 4 శాతం, సింగపూర్‌లో 4 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. ఉద్యోగుల వలసలతో ఇబ్బందులు ఎదు రవుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను కాపాడుకునేందుకు భారత్‌లోని కంపెనీ లు ఈ ఆర్థిక సంవత్సరంలో జీతాలను రెండంకెల స్థాయిలో పెంచవచ్చని విల్లీస్ టవర్స్ వాట్సన్ అభిప్రాయపడింది. 2021-22లో వేతన పెంపు సగటు 9.5 శాతంగా నమోదైందని వెల్లడిం చింది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిపినట్లు, భారత్‌లో విభిన్న రంగాలకు చెందిన 590 కంపెనీలను సర్వే చేయడం జరిగిందని విల్లీస్ టవర్స్ వాట్సన్ తెలిపింది.