10 వేల ఉద్యోగాల కోత
1 min readప్రముఖ వైర్ లెస్ నెట్వర్క్ దిగ్గజ సంస్థ నోకియా నిర్ణయం సంచలనంగా మారింది. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యయం నిమిత్తం ఖర్చుల తగ్గింపునకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే 10వేల మంది ఉద్యోగులను తగ్గించనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న లక్ష మంది ఉద్యోగుల సంఖ్యను 80 మరియు 85 వేల మధ్యకు తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నాలుగు ప్రధాన విభాగాలలోని ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనంది. దాదాపు 5200 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగుల కోత ద్వార ఆదా చేయాలని యోచిస్తోంది. అయుతే ఈ కోత ఏ దేశంలో అన్నది ఇంకా స్పష్టత రావాలి.