అట్టహాసంగా ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రి
1 min read
పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత బీవీ మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు
క్రిటికల్ కేర్ తో పాటు గుండె వైద్యులను అందుబాటులోకి తెస్తాం
ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన
ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి చేతులు మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దసంకల్పంతో మాచాని సోమప్ప స్థలాలు ఇస్తే ఎమ్మెల్యేగా, మంత్రిగా బీవీ మోహన్ రెడ్డి అభివృద్ధిని చేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన అభివృద్ధి నేటికీ కంటికి కనబడుతూనే ఉందన్నారు. నాడు 30 పడకల ఆస్పత్రికి ప్రారంభమై నేడు వంద పడకల ఆసుపత్రిగా నా చేతుల ద్వారా ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో నాబార్డ్ నిధులు కింద ఈ ఆసుపత్రి నిర్మాణానికి 13 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. 2014-19లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయించడం జరిగిందని, అయితే గత వైసిపి ప్రభుత్వం కేవలం శిలాఫలకం మార్చారు తప్ప నిర్మాణం చేపట్టకుండా వైసీపీ కాలయాపన చేసిందని విమర్శించారు. పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత ఎమ్మిగనూరు అభివృద్ధి చేసింది నా తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆసుపత్రికి క్రిటికల్ కేర్ అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చి, అత్యవసర వైద్య సేవలకు అందించేందుకు వీలు ఉంటుందన్నారు. అలాగే గుండె వైద్య నిపుణుల డాక్టర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కర్నూల్ – మంత్రాలయం వయా ఎమ్మిగనూరు రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని, అలాగే ఎమ్మిగనూరు – కర్నూల్ నేషనల్ హైవే నిర్మాణానికి పట్టుదలతో ఉన్నామన్నారు. అలాగే బైపాస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల్లోనే డివో లేఖను అందించేందుకు ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మిగనూరు అభివృద్ధి గురించి ఇతర ప్రాంతాల వారు చర్చించే విధంగా చేసి చూపెడతానని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు ఆసుపత్రి డెలివరీస్ లో రాష్ట్రంలో మొదటి స్థానం రావడం పట్ల వైద్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి, ఆసుపత్రి సూపర్డెంట్ సుధా, వైద్యులు మల్లికార్జున, బాలాజీ, చిరంజీవి, భార్గవ్, సమీరా, హెచ్ డి సి సభ్యులు వాల్మిక రామకృష్ణ నాయుడు, సురేష్ చౌదరి, అంబేద్కర్, కమిషనర్ గంగిరెడ్డి, వైద్య సిబ్బంది విష్ణు, దొరబాబు, పార్టీ కౌన్సిలర్లు, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
