PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

100% జిఈఆర్ సాధించాలి..

1 min read

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   100% జిఈఆర్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి గారు అన్ని జిల్లా కలెక్టర్లతో మరియు జాయింట్ కలెక్టర్లు తో వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ100% జిఈఆర్ సాధించడానికి 11 మరియు 12 తరగతుల విద్యార్థులను అవసరమైన విద్యాసంస్థలలో చేర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరీక్షలు రాసిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణత  ప్రమాణ పత్రాలు (సర్టిఫికెట్లను) డిజి లాకర్ లో పొందుపరిచామని వాటిని డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని విద్యార్థులను కోరారు. ఫిజికల్ కాపీలను సంబంధిత కాలేజీలకు పంపడం జరిగిందని వాటిని పొందవలసిందిగా సూచించారు.రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రానికి సరాసరి 316 మంది ఒక కేంద్రానికి పరీక్షల నిమిత్తం వస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 81,260 మందికి కళ్లద్దాల అవసరం ఉందని డాక్టర్లు సూచించారని ,4799 మంది రక్తపోటు ఉన్నవారుగా 32,468 మంది చక్కెర వ్యాధిగ్రస్తులుగా గుర్తించడమని జరిగిందని తెలిపారు. 191 మంది టీబి వ్యాధితో 4521 మంది మలేరియా 438 మంది డెంగ్యూ వ్యాధి భారిన పడ్డారని, వీరందరికీ సరియైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు ఎదుగుదల లోపించిన పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను ఆరోగ్య శాఖకు అనుసంధానం చేసి వారికి అవసరమైన పోషకాలు అందే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.” సక్షం “అంగన్వాడీ కేంద్రాలకు వంట పాత్రలు, చాపలు, డ్రైనేజీ వ్యవస్థకు, బల్లలు మరియు రిపేర్లు నిమిత్తము అవసరమైన మేరకు నిధులు విడుదల చేశామని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైతే సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు.జగనన్న హౌసింగ్ కాలనీలు ముఖ్యమంత్రి గారిచే ఈ నెల 11న ప్రారంభం చేసే అవకాశం ఉన్నందున స్వాగత ద్వారాలకు అవసరమైన రంగులు వేసి సిద్ధంగా ఉంచాలని మిగిలిపోయిన పనులు ఉంటే పూర్తి చేసుకోవాలని ఆదేశించినారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జడ్పీ సీఈవో, పిడి హౌసింగ్ , సిపిఓ , ఎస్సీ ఇరిగేషన్ , డిఎం & హెచ్ ఓ, ఎస్ఎస్ఏ పిఓ ఐసిడిఎస్, సాంఘిక సంక్షేమ జెడి , ఆరోగ్యశాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author