వరికి వందేనా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : వరికి కనీస మద్దతు ధర పెంపును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సరైన అంచనాలు లేకుండా వరికి రూ.100 పెంచారని విమర్శించారు. మిగతా పంటలదీ అదే పరిస్థితని అన్నారు. కనీస మద్దతు ధర రూ.500 పెంచి ఉంటే.. రైతులకు కొంతైనా ఉరట లభించేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌలు రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయితే రైతుకు మద్దతు ధర లభించదో అక్కడి ప్రభుత్వంపై చర్యలు తీసుకునే పరిస్థితి రావాలని సోమిరెడ్డి అన్నారు.