100 మంది యువకులు వైసీపీ ని వీడి టీడీపీ లో చేరిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కల్లూరు అర్బన్ 19 వ వార్డ్ గణేష్ నగర్ కి చెందిన వైసీపీ పార్టీకి చెందిన యువత శివ ప్రసాద్,జయరాం,తో పాటు 100మంది యువకులు గౌరు చరిత రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ చరిత రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించి వారికి స్వాగతం పలికారుపార్టీ లో చేరినవారు బిల్డింగ్లు,గణేష్ నగర్ కి చెందిన నారాయణ,జయరాం,లక్కీ మదు, శీను,ఆది,మదు, మధ్ధి,దను,శేఖర్, రాజశేఖర్,రఘు,తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి,కల్లూరు మండల నాయకులు పూసులురు ప్రభాకర్ రెడ్డి,19 వ వార్డ్ ఇంచార్జి, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి,19 వ వార్డ్ ముఖ్య నాయకులు రామకృష్ణ రెడ్డి, న్యాయ విభాగం రాష్ట కార్యదర్శి నాగ ముని, మాండ్ర నరేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.