హుజురాబాద్ ఉపఎన్నికల్లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పోటీ !
1 min readపల్లెవెలుగు వెబ్ : అన్యాయంగా తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికలో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు పోటీ చేస్తారని ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్ లతో కలిసి హైదరాబాద్ లోని బీసీ భవన్ లో ఒక రోజు ధర్మదీక్ష చేపట్టారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 7,600 మందిని తొలగించడం దుర్మార్గమని, వారు చేసిన తప్పేంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 24 అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.