PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

1000 కి.మీ. మైలురాయికి ‘యువగళం’

1 min read

పాదయాత్రలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు

సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకం ఆవిష్కరణ

21వవార్డు దత్తత తీసుకుంటానన్న లోకేష్

జనసంద్రంగా మారిన ఆదోనిలోని వీధులు

అడుగడుగునా యువనేతకు జన నీరాజనాలు

యువనేతను చూసేందుకు బారులుతీరిన జనం

లోకేష్ రాకతో కిటకిటలాడిన ఆదోని వీధులు

ఆదోని బహిరంగసభకు పోటెత్తిన జనప్రవాహం

ఆదోని: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదోనిలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఆదోని సిరిగుప్ప సర్కిల్ లో పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయి చేరుకోవడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువగళం సైనికులు ఆనందంతో కేరింతలు కొట్టారు. యాత్ర వెయ్యికిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా యువనేత సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత… అధికారంలోకి వచ్చాక 21వవార్డును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఇది తన జీవితంలో మరపురాని ఘట్టంగా అభివర్ణించారు. ఆదోనిలో 77వరోజు యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువకలు, మహళలు, చిన్నపిల్లలు రోడ్లవెంట బారులు తీరి యువనేతను కలిసేందుకు పోటీపడ్డారు. ప్రధానరహదారికి ఇరువైపులా లోకేష్ ని చూసేందుకు జనం బారులు తీరారు. యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. తనను కలిసేందుకు వచ్చిన వివిధ వర్గాల ప్రజలను కలిసిన యువనేత ఆప్యాయంగా వారిని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. యువనేత వివిధ కూడళ్లకు చేరుకునే సమయంలో రోడ్లన్నీ కిక్కిరిసోయాయి. తనని కలవడానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని మహిళలు లోకేష్ వద్ద తమ గోడు విన్పించారు. ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని యువకులు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి  ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతకు భరోసా ఇచ్చి ముందుకు సాగారు. ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు, రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు, మాలమహానాడు, ఎంఆర్ పిఎస్, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, మోటారు సైకిల్ మెకానిక్స్, ఫ్లెక్సీ ప్రింటింగ్ కార్మికులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సిరిగుప్ప సర్కిల్ లో జరిగిన బహిరంగసభకు ఆదోని నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన జనం పోటెత్తారు. యువగళం పాదయాత్ర వెయ్యికిలోమీటర్ల మైలురాయి చేరుకోవడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ లో నూతనోత్సాహం నెలకొంది. ఆదోని శివారు క్యాంప్ సైట్ నుండి ప్రారంభమైన పాదయాత్ర బైపాస్ క్రాస్, ఆర్ట్స్ కాలేజి, దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్డు, మేదరగేరి బ్రిడ్జి, రాయల్ మిల్ మీదుగా కడికొత్త క్రాస్ వరకు సాగింది.

మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ సందర్భంగా ఆదోనిలో మైనారిటీ సోదరులకు యువనేత లోకేష్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు.రంజాన్ పర్వదినాన తాను ఆదోనిలో వెయ్యికిలోమీటర్ల మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తికావడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలని ఈ సందర్భంగా కోరారు.

1000 కి.మీ. చేరుకున్న సందర్భంగా 21వ వార్డు దత్తత

యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా యువనేత లోకేష్ సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్ ఉద్వేగంగా మాట్లాడారు. 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో నా యువ‌గ‌ళం పాద‌యాత్ర 1000 కి.మీ. మైలురాయికి చేరుకుంది.ఈ సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కనీస మౌలిక వసతులు లేక దళితులు, బీసీలు, మైనార్టీలు పడుతున్న బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డ్ ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. త్రాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇస్తూశిలాఫ‌ల‌కం ఆవిష్కరిస్తున్నట్లు యువనేత లోకేష్ పేర్కొన్నారు.

*ఈ గడ్డపై 1000 కి.మీ. చేరుకోవడం నా అదృష్టం*

*అరాచకాలను ఎండగట్టేందుకు ఆయుధంలా యువగళం*

*యాత్రపై యువత మనోభావాలను నాతో పంచుకోండి*

యువగళం పాదయాత్ర  రాయలసీమ గడ్డపై 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడానికి సహాయ, సహకారాలు అందించిన యావత్ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడింది. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా, సుభిక్షంగా మార్చాలన్నది నా ఆకాంక్ష. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించేందుకు నేను యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. ఈ సందర్భంగా యువత ఆలోచనలు, అభిప్రాయాలను ఈ దిగువ వాట్సాప్  నెంబర్ లో నేరుగా నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వాట్సాప్ నెం. 96862 – 96862, Registration form: https://yuvagalam.com//register,  Email Id: [email protected] ద్వారా మీ మనోభావాలను నేరుగా నాతో పంచుకోవచ్చు.

పెంచుకుంటూ పోతానన్నది పెట్రోలు రేట్లా జగన్?!

ఆదోనిలోని ఒక పెట్రోలు బంకువద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్రోలు ధరలు జగన్ పాపాల చిట్టా మాదిరిగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదోనిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద లీటరు పెట్రోలు ధర రూ.111.31, డీజిల్ ధర రూ.99.09 రూపాయలు  కాగా, పొరుగున ఉన్న కర్నాటకతో పోలిస్తే పెట్రోలు 13రూపాయలు, డీజిల్ ధర 10రూపాయలు అధికం. ఎన్నికలప్పుడు జగన్ పెంచుకుంటూ పోతానంటే అమాయక ప్రజలు నమ్మి ఓట్లు గుద్దేశారు. అధికారంలోకి వచ్చాక ఆకాశమేహద్దుగా రోజురోజుకు పెంచుతూ పోతున్న పెట్రోలు, డీజిల్, నిత్యవసరాలు, ఇంటిపన్నులు, కరెంటు చార్జీలు చూశాక గానీ జలగన్న నిజస్వరూపమేమిటో  జనానికి అర్థం కాలేదు. ఒక్కఛాన్స్ తో నిండామునిగిన ఎపి ప్రజలనోట ఇప్పుడు సైకో పోవాలి…సైకిల్ రావాలిఅనే మాటలే వినవస్తున్నాయని యువనేత వ్యాఖ్యానించారు.

అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా?

ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయం సెల్ఫీ దిగిన లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై ఘాటువ్యాఖ్యలు చేశారు. పూర్వాశ్రమంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఉండేది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క  ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ, మేం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ భవనాన్ని సచివాలయంగా మార్చేసి తమ పార్టీ రంగులు వేసుకున్నారు.  ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు జగన్మోహన్ రెడ్డీఅంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

About Author