బాధిత కుటుంబానికి 10వేల రూ. ఆర్థిక సహాయం
1 min read– ప్రమాదవశాత్తు మరణించిన సీను భార్య పద్మా కి..
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గత వారం చెట్టు కొమ్మ పడడం వలన చింతలపూడి కి చెందిన హెచ్చు శ్రీను తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికత్స అందించడం జరిగింది. కాని దురదృష్టవశాత్తు శ్రీను మరణించడంతో శ్రీను భార్య పద్మ, పిల్లలు అనాధలయ్యారు. వారికి తమవంతు సాయంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, చింతలపూడి శాఖ వారు శ్రీను భార్య పద్మ కి రూ. పదివేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ డైరెక్టర్ ఎ.సత్యనారయణ, చింతలపూడి సొసైటీ మాజీ ఛైర్మన్ ఎ. సుబ్బారావు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చింతలపూడి శాఖ ఛైర్మన్ ఎ. అప్పారావు, కో ఛైర్మన్ ఎం. శామ్యూల్, అధ్యక్షులు పి. సోమశేఖర్, కన్వీనర్, కాండ్రేగుల నాగ చిన్నారావు,కమిటీ సభ్యులు ఎస్. కిరణ్ బాబు, కె. రాంబాబు, పి. కిషోర్, చింతలపూడి ఎ.ఎం.సి. మాజీ డైరక్టర్ కె. ఏలియ మరియు స్థానికులు పాల్గొన్నారు.