వర్షం రాక కోసం 101 నీళ్లు బిందెలతో ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వర్షం రాక కోసం పత్తికొండ మండల పరిధిలో రాజుల మండగిరి గ్రామంలో గ్రామ దేవతలకు, గ్రామం బొడ్రాయికి 101 బిందెల నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వర్షం కోసం గ్రామంలో అహోరాత్రులు సప్త భజనలు చేస్తున్నారు. అనంతరం శనివారం ఉదయం గ్రామంలోని సర్వదేవతలు శ్రీశ్రీ ఆంజనేయ స్వామి. దేవాలయం శ్రీశ్రీ కర్రెమ్మ .దేవాలయం శ్రీ శ్రీ చౌడమ్మ. దేవాలయం గ్రామ బొడ్రాయికి భక్త జనం, గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి గ్రామదేవతలకు, దేవాలయం దగ్గర 101 బిందెలు నీటితో అభిషేకించారు. అనంతరం స్థానిక హంద్రీ వాగులో భక్త బృందం గంగా జలానికి పోయి అక్కడనుండి భజనలు, తప్పట్లతో పవిత్ర జనాలను తీసుకువచ్చి దేవాలయాల్లో పవిత్ర జలాలను ఉంచుతారు.గతంలో మంచి వర్షాలు పడి బాగా పంటలు పండాయని, కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా వర్షం జడ కానరాకపోవడంతో ఇప్పటికైనా వర్షం కురవాలని గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో భజనలు ప్రత్యేక పూజలు పవిత్ర జలాల అభిషేకాలు యజ్ఞాలు తలపెడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు చిన్నపిల్లలు పాల్గొని వర్షం కోసం గ్రామ దేవతలకు ముక్కుకున్నారు.