ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలు : జగన్
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో జాబ్ కేలండర్ విడుద చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. దళారులు, సిఫార్సులు, పైరవీలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలుసుకునేందుకు జాబ్ కేలండర్ తీసుకొస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామని, వీటిలో 1,84, 264 శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 పొరుగు సేవలు, 19,701 ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదిక భర్తీ చేశామని చెప్పారు. 3500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని, 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చామని తెలిపారు.