NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘంటసాల  101 వ జయంతోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మధురకవి ఎలమర్తి రమణయ్య తన గానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.తరువాత ముఖ్య అతిథి డాక్టర్ డబ్ల్యు సీతారాం  జ్యోతి ప్రజ్వల గాయించారు తర్వాత ఘంటసాల  చిత్రపటానికి ఘంటసాల గానకళా సమితి ఉపాధ్యక్షులు కురాడి చంద్రశేఖర్  , డాక్టర్ డబ్ల్యూ సీతారాం పుష్పాలంకరణ గావించినారు.పద్మశ్రీ ఘంటసాల గాల కళా సమితి ఉపాధ్యక్షులుకురాడి చంద్రశేఖర్  ఘంటసాల  గురించిఆయన గొప్ప సంగీత శాస్త్రజ్ఞుడు మరియు కళాకారుడు అనే విషయము ప్రపంచానికే ఎరుక,అలాగే ఆయన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు,ఆయన దేశ స్వాతంత్రం కొరకు పోరాడి జైలు పాలయ్యారు.గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు జీవితాంతం ఖద్దరు బట్టలు తొడిగారు ఆయనరాజకీయ విశ్రాంత వేతనం తీసుకోలేదు బళ్లారి జైల్లో రెండు సంవత్సరాల పాటు రాజాజీ,కామరాజు నాడర్, పొట్టి శ్రీరాములు,నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి, వారితో కలిసి శిక్షను అనుభవించారు.తర్వాత మన మధురకవిఎలమర్తి రమణయ్య  మరియుశ్రీ బిఎస్ రావు  ఘంటసాల   పాడిన పాటలను మధురంగా ఆలపించారు.మరియు  రంగస్వామి  పద్యాలను  మధురంగా ఆలపించారు.చలన చిత్ర సంగీతానికి కొత్త వరవడిని తెచ్చారు. వారు పాడిన భగవద్గీత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.నవరసాలు పలికించిన మధుర గాయకులు వారు అని అన్నారు.పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి అధ్యక్షులు   శ్రీ సుస్వరం వాసుదేవ మూర్తి .శ్రీ రాఘవేంద్ర ప్రసాద్ వందనసమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలోగానకళా సమితి సభ్యులు ముఖ్యంగా శ్రీ జగన్నాథ గుప్తా , కే.సి రాముడు ,  బిఎస్ రావు ,సత్య ప్రసాద్ , హనుమాన్ కళాశానికి అధ్యక్షులు  పి,హనుమంతరావు చౌదరి ,పాల్గొని ఘంటసాల 101 వ జయంతి సందర్భంగా ఘంటసాల ప్రాణ కళా సమితి పెద్దలను ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా,పి, హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ వెంకటేశ్వరరావు  తన ఊరినే ఇంటిపేరుగా చేసుకుని తెలుగు పాట కోసం తెలుగు మాట కోసం అహర్నిశలు పాటుపడి ప్రపంచ దేశాల్లో తెలుగు పాటను భగవద్గీతను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు ఘంటసాల మనమందరం కూడా కళాకారులుగా ఆయన అడుగుజాడల్లో నడవాలని వివరించారు,ఘంటసాల అమర్ రహే అని నినాదాలుగావించారు.

About Author