PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దామోదరం సంజీవయ్య 103వ జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కోడుమూరు:   కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య  103వ జయంతి వేడుకలు సి బెళగల్ మండలంలోఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదరం సంజీవయ్య  వారసుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు కోడుమూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దామోదరం  రాధాకృష్ణ గారు హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సంజీవయ్య  రాష్ట్రానికి, దేశానికిఎనలేని సేవలు చేశారని,మరీ ముఖ్యంగా 1960 లోనే సంక్షేమానికి పునాది వేసింది దామోదరం సంజీవయ్య  అని ఇప్పుడు తీసుకుంటున్న వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు దామోదరం సంజీవయ్య  ప్రవేశపెట్టినవే అని, రైతుల కోసం పలు ప్రాజెక్టులు నిర్మించాడు అని కొనియాడారు .రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శిశ్రీ వెంకటరాముడు మాట్లాడుతూబీసీలకు ఎనలేని సేవ చేసింది ఒక సంజీవయ్య గారే అని కొనియాడారు. దేశంలోనే బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సంజీవయ్యకి దక్కిందని కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రియాజుద్దీన్ మాట్లాడుతూ దేశంలోనే కార్మికులకు బోనస్ ప్రవేశపెట్టిన ఘనత దామోదరం సంజీవయ్య దే అని మరి ముఖ్యంగా ఉర్దూ భాషను మూడవ అధికార భాషగా ప్రకటించినది మా దామోదరుడే ప్రశంసించారు.   కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల శేఖర్  మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య  విలువలతో కూడిన రాజకీయం చేశారని రాజకీయ వనములో తులసి మొక్కలాంటి వాడని , అతి చిన్న వయసులో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన తనకంటూ తన కుటుంబ సభ్యులకు నయా పైసా సంపాదించకుండా తన కుటుంబ సభ్యులను కూడా సమాజంలో ఒకరిగా చూసారే గాని కుటుంబ సభ్యులుగా చూడలేదు ఇందుకు నిదర్శనం ఇప్పటికీ ఉండే ఆయన పూరి గుడిసె అని కొనియాడారు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీన్  మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళకు క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చి యావత్ మహిళల కు ఆ కాలంలోనే సమిచిత స్థానం కల్పించిన మహనీయుడు మన సంజీవయ్య  అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రెటరీ శశిధర్ , బెలగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డి సి సి ఎస్ సి సెల్ అధ్యక్షులు దాసరి పాండురంగయ్య, కోడుమూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపాల్ , డాక్టర్ గోవర్ధన్  దాసరి మద్దిలేటి ,ఓబులేష్ , కోడుమూరు హరి తదితరులు పాల్గొన్నారు.

About Author