PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాకు 104 ఐదు కొత్త వాహనాలు మంజూరు

1 min read

– జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఫ్యామిలీ ఫిజిషియన్ విధానంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అదనంగా 104 (5 కొత్త వాహనాలను) ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వైయస్ఆర్ సెంటినరీ హాలు ఆవరణలో 104 (5 కొత్త వాహనాలను)జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటరమణ తదితరులు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజిర్ జీలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 29 మండలాలకు 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి అదనంగా మరో 104 (5 కొత్త వాహనాలను) ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. మంజూరైన ఐదు వాహనాలను డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నంద్యాల, ఒకటి రిజర్వులో (ఇతర వాహనాలు రిపేర్ లో వున్నప్పుడు ఈ వాహనం వినియోగిస్తారు) వుంటుందన్నారు. పెద్ద మండలాల్లో వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడటం వల్ల ప్రభుత్వం అదనంగా మరో 5 కొత్త వాహనాలు మంజూరు చేసిందన్నారు. ప్రతి 104 వాహనం ఒక సచివాలయాన్ని రెండుసార్లు సందర్శించి వైద్య సేవలు అందిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇందులో డాక్టర్, MLHP, ANM, Asha, MPHA మరియు DEO అందుబాటులో ఉంటారన్నారు. ఒక మెడికల్ ఆఫీసర్ 104 విధులను నిర్వహిస్తే మరో మెడికల్ ఆఫీసర్ PHC నందు సేవలు అందిస్తారన్నారు. ఉదయం వేళల్లో వచ్చిన ANC, PNC, BP, Sugar మరియు జనరల్ OP చూడడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం నుండి రాలేని వికలాంగులు, వృద్ధులు మరియు మంచానికి పరిమితమైన వారిని పరీక్షించి వారి తగిన జాగ్రత్తలు చెప్పి మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. ప్రభావతి, 104 జిల్లా నోడల్ ఆఫీసర్ డా. జగదీష్ చంద్రారెడ్డి, 104 జిల్లా మేనేజర్ మొహమ్మద్ రఫీ, MLHP లు తదితరులు పాల్గొన్నారు.

About Author