PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

1 min read

– ఎనిమిది గంటలకే పరీక్షల కేంద్రాల వద్దకు చేరుకొని హాల్ టికెట్ నెంబర్లు వెతుక్కుంటున్న విద్యార్థులు విద్యార్థులు….
– పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు…
– పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రం ఏర్పాటు…
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏ, పరీక్ష కేంద్రం బి, కేజీబీవీ పాఠశాలలో మరియు మండల పరిషత్ పాఠశాల బస్టాండ్ స్కూల్ నందు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్ద చేరుకొని తమ తమ హాల్ టికెట్ నెంబర్లు రూములు వెతుక్కోవడం ప్రారంభమైంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం-ఏ లో 224 మంది హాజరు కావలసి ఉండగా 220మంది విద్యార్థులు హాజరైనట్లు, నలుగురు విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు ఎగ్జామ్ చీఫ్ కృష్ణయ్య తెలిపారు. పరీక్షా కేంద్రం బి నందు 225 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 222మంది, ఒక హ్యాండ్ క్యాప్డ్ విద్యార్థి హాజరైనట్లు, ఇద్దరు విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు ఎగ్జామ్ చీఫ్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే కేజీబీవీ పాఠశాల నందు ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 137 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 135 మంది విద్యార్థులు హాజరైనట్లు, ఇద్దరు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఎగ్జామ్స్ చీఫ్ ముజాహిద్దీన్ భాష తెలిపారు. అలాగే మండల పరిషత్ (బస్టాండ్ స్కూల్)పాఠశాల యందు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 120 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 118 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎగ్జామ్ చీఫ్ రామలింగప్ప తెలిపారు. గోనెగండ్ల మండలంలో మొత్తం 706 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 696 మంది విద్యార్థులు హాజరయ్యారు పదిమంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై తిమ్మారెడ్డి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. చుట్టుపక్కల ఎవరైనా సంచరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షాల కేంద్రాల వద్ద మొదటిరోజు ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయి.

About Author