గడివేముల మండల కేంద్రానికి చేరిన పదవ తరగతి ప్రశ్నాపత్రాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షాలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను విద్యాశాఖ అధికారులు గడివేముల లోని స్థానిక పోలీసు స్టేషన్‌లో గురువారం భద్రపర్చారు. పదో తరగతి పరీక్ష చీఫ్ సూపర్డెంట్ శైలజ, ఎస్ ఎస్ సి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అన్వర్ హుస్సేన్ భద్రతా సిబ్బందితో , జిల్లా పరిషత్ పాఠశాల చీఫ్ సూపర్డెంట్ ప్రతాప్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సుంకన్న లు కలిసి పోలీస్ స్టేషన్లో ప్రశ్నా పత్రాలను సబ్జెక్టుల వారీగా భద్రపరిచి వాటికి సీల్ వేశారు.ఈ సందర్భంగా ఎంఇఒ రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు సెట్ల చొప్పున పరీక్షా పత్రాలు వచ్చాయన్నారు. మండలంలో రెండు సెంటర్లలో విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాస్తున్నారన్నారు. మోడల్ స్కూల్ సెంటర్లో 250, గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్లో230 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. ప్రశ్న పత్రాలను స్టేషన్‌లో భద్రంగా ఉంచామన్నారు. పరీక్షల సమయంలో వాటిని బయటకు తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.