PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్‌ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.

                                     

About Author