మార్చి 1వ తారీకు నుండి కార్డుదారులకు 11 రూ. కేజీ రాగి పిండి
1 min readజాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో మార్చి నెల 1వ తేది నుండి కార్డుదారులకు 11 రూపాయలకే కేజీ రాగి పిండి పంపిణీ చేయడం జరుగుతుందని పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వార ప్రజలకు సరఫరా చేయనున్న పోషక విలువలు కలిగిన రాగి పిండి పంపిణీ చేసే విషయంపై జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ మార్చి నెల 1వ తేది నుండి కార్డుదారులకు 11 రూపాయలకే కేజీ రాగి పిండిని ఎండియు వాహనం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మార్కెట్లో కేజీ రాగి పిండి ధర దాదాపు 40 రూపాయలు ఉందని కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే కార్డుదారుల ఎంపిక ప్రకారం బియ్యం కు బదులుగా జొన్నలు/రాగులను అందజేయడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాకు 6,76,209 కార్డులకు గాను 11857 టన్నుల బియ్యము,360 టన్నుల చక్కెర,676 టన్నుల రాగి పిండి, 671 టన్నుల జొన్నలు,126 మెట్రిక్ టన్నుల రాగులు కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో రైతుల దగ్గర నుండి 850 టన్నుల జొన్నలను పౌర సరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి కార్డుదారులకు బియ్యం కు బదులుగా అర్హత మేరకు జొన్నలను ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.వంటగ్యాస్ పంపిణీ విషయంలో వినియోగదారుల నుండి ఏజెంట్ కార్యాలయం నుండి 15 కిలోమీటర్ల లోపు ఉన్న వినియోగదారుల నుండి ఏలాంటి రవాణా రుసుము వసూలు చేయరాదన్నారు. గ్యాస్ ఏజెన్సీ వారి నుండి 15 కిలోమీటర్ల లోపల ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, 15 కిలోమీటర్లు దాటి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి అన్న వివరాలను గ్యాస్ ఏజెన్సీ నుండి సేకరించి సమర్పించాలని డిఎస్ఓ ను ఆదేశించారు.జిల్లాలో జగనన్న ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ లు వేగవంతంగా సాగుతుందని ఇప్పటివరకు జిల్లాలో 62440 రిజిస్ట్రేషన్లు పూర్తయినాయని పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లు కూడా త్వరగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డి ఎం షర్మిల, డీఎస్ఓ… KVSM ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.