NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాల్పుల మోత‌… 11 మంది మృతి ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం సృష్టించింది. రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలిరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్ లో పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఓ వ్యక్తి జ‌రిపిన కాల్పుల్లో 7గురు మ‌ర‌ణించారు. పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న మ‌హిళ‌కు కాల్పులు జ‌రిపిన వ్యక్తి స్నేహితుడ‌ని స‌మాచారం. బ‌ర్త్ డే వేడుక‌ల స‌మ‌యంలో అక్కడికి ప్రవేశించి.. కాల్పులు జ‌రిపి.. అనంత‌రం తాను కూడ కాల్చుకుని చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు ఉడ్ ల్యాండ్ లో ఇరుగుపొరుగు వారి మీద మ‌రొక వ్యక్తి కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు. అనంత‌రం జ‌రిగిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మ‌ర‌ణించాడు.

About Author