కలెక్టర్ గా 11 ఏళ్ల బాలిక !
1 min readపల్లెవెలుగు వెబ్ : 11 ఏళ్ల బాలిక కలెక్టర్ అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కానీ ఒక్క రోజే. గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన ఫ్లోరా అసోడియా ఒక్క రోజు అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసింది. 7 వ తరగతి చదువుతున్న అసోడియా కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. గత నెలలో ఆమెకు శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం ఆమె ఆరోగ్యం క్రమంగా కోలుకుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆ చిన్నారి కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలుసుకున్నారు. చిన్నారి గురించి అహ్మదాబాద్ కలెక్టర్ సందీప్ సాంగ్లే కు వివరించారు. దీంతో చిన్నారి కలను తీర్చేందుకు కలెక్టర్ ఒప్పుకున్నారు. చదవులో ముందు ఉండే ఫ్లోరా అసోడియా బ్రెయిన్ ట్యూమర్ బారినపడ్డారు. ఆమె కోరికను తీర్చినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.