ఘనంగా టేకో బ్యాంక్ 110 వ వార్షికోత్సవ వేడుకలు..
1 min read– పదివేల మంది పైగా ఖాతాదారులకు విశిష్ట సేవలు..
– చైర్మన్ ఏవి అంబికా ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: కీర్తిశేషులు వల్లూరి రామారావు 1914 లో స్థాపించిన ది ఏలూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (టేకో బ్యాంక్) ఆగస్టు 2023 నాటికి 109 వసంతాలు పూర్తిచేసుకుని 110 వ వార్షికోత్సవ వేడుకలకు చైర్మన్ ఏవి అంబికా ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని సీఈవో ఎం అచ్యుతరావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బ్యాంకు ఖాతాదారుల సమక్షంలో వేడుకలను నిర్వహించారు. ఖాతాదారులకు అభివృద్ధితో పాటు బ్యాంకు నిర్వహిస్తున్న లావాదేవీలను. సేవలను వివరిస్తూ వారి సూచనలను సందేహాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు పదివేల మంది పైగా ఖాతాదారులతో 20010 కోట్ల టర్నవర కలిగి, 121 కోట్ల డిపాజిట్లతో 81,50 లక్షల అడ్వాన్సు కలిగి 19 సంవత్సరాలుగా ఖాతాదారులకు విశిష్ట సేవలు అందిస్తూ నూట పదవ సంవత్సరం సందర్భంగా ఖాతాదారులు అందరికీ ప్రత్యేక శుభాభినందనలు సీఈఓ ఎం అచ్యుతరావు తెలియజేశారు. ముఖ్య కార్యాలయం ఏలూరు కెనాల్ రోడ్ లో మరియు ఆర్ఆర్ పేట బెండపూడి వారి వీధిలో జంగారెడ్డి గూడెం, పాలకొల్లు లో శాకోప శాఖలుగా వృద్ధి చెంది అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. 110 సంవత్సరాల వసంత వేడుకలలో ఏజీఎం బాల భాస్కర్, ఏవో మదన్ మోహన్, మేనేజర్ దానం జైయి, పాలకవర్గ సభ్యులు కనక శెట్టి రమేష్ , పట్టకర్ల నాగభూషణం, బివి సుబ్రహ్మణ్యం, జె రాధాకృష్ణ మరియు కార్యాలయ సిబ్బంది ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.