NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార‌త్ కు 113 కోట్ల స‌హాయం.. గూగుల్ ప్రక‌ట‌న‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త దేశానికి 113 కోట్లు స‌హాయం చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ముందుకు వ‌చ్చింది. ఈ మేర‌కు గురువారం ఓ ప్రక‌ట‌న విడుదల చేసింది. 80 ఆక్సిజ‌న్ ప్లాంటులు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచే కార్యక్రమం చేప‌ట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యక‌ర్తల‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న అపొలో మెడ్ స్కిల్స్ కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌నుంది. వివిధ రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల‌కు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆర్మాన్ సంస్థకు గూగుల్ ఆర్థిక స‌హాయం మంజూరు చేసింది. క‌రోన సంక్షోభం నుంచి భారత్ నెమ్మదిగా కోలుకుంటోంద‌ని, ఆరోగ్య సంర‌క్షణ స‌దుపాయాలు.. శ్రామిక శ‌క్తిని బ‌లోపేతం చేయ‌డానికి గూగుల్ త‌న వంతు స‌హాయం చేస్తుంద‌ని గూగుల్ ఇండియా హెడ్ సంజ‌య్ గుప్తా తెలిపారు.

About Author