114 మంది కాల్చివేత..
1 min readమయన్మార్: మయన్మార్ ను నెత్తుటి ప్రవాహం ముంచెత్తింది. ఆ దేశ పౌరులను సైన్యం పిట్టల్లా కాల్చివేసింది. ఏ సందులో చూసిన హృదయవిదారక ఆర్థనాదాలే. ఏ వీధిలో చూసిన నెత్తుటి గాయలతో కుప్పకూలిన క్షతగాత్రులే. మయన్మార్ ఘటనతో అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. ముక్తకంఠంతో ఖండించింది. మయన్మార్ 76 వ సైనిక దినోత్సవాన భద్రతా బలగాలు రెచ్చిపోయాయి. మయన్మార్ లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరులను దొరికిన వాళ్లను దొరికినట్టు కాల్చిపారేసింది. అయితే.. సైనిక దినోత్సవాన నిరసనలకు దిగితే.. తీవ్రమైన చర్యలుంటాయని .. సైన్యం ముందే హెచ్చరించినా .. ప్రజలు వెనక్కి తగ్గలేదు. దీంతో సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్సుల్లో మయన్మార్ వ్యాప్తంగా 114 మంది మృతి చెందారని సమాచారం. స్థానిక మీడియా కథనం ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. గాయపడిన వారి సంఖ్య కూడ అధికంగా ఉందని సమాచారం. అయితే.. బుల్లెట్ల గాయాలతో చాలామంది మయన్మార్ పౌరులు.. సరిహద్దులోని మణిపూర్ లో ప్రవేశించారు. వారిని స్థానిక భారత అధికారులు ఆస్పత్రికి తరలించారు.