ఘనంగా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 116వ జయంతి
1 min readఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIDSO ( ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్) కర్నూల్ నగర కమిటీ ఆధ్వర్యంలో గొప్ప రాజీలేని స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా కర్నూల్ నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల ఎదుట ఉన్న గ్రౌండ్ నందు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో ఏఐడీఎస్ఓ కర్నూల్ నగర కార్యదర్శి H. మల్లేష్ మాట్లాడుతూ – నేడు విద్యార్థులు, యువతీ యువకులు అందరూ కూడా గొప్ప స్వాతంత్ర ఉద్యమ విప్లవకారుడు భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని, వారు కలలుగన్న సమాజం కొరకు పాటు పడాలని కోరారు… సమసమాజ నిర్మాణానికై విద్యార్థులు, యువకులు నడుంకట్టి ముందుకు రావాలని పిలుపునిచ్చారు… ఆ రోజుల్లో భగత్ సింగ్ ఏ విధంగా అయితే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడో, అదేవిధంగా నేడు విద్యార్థులకు, యువకులకు ఉన్నటువంటి సమస్యల పైన ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు… కాని నేడు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి స్కూల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడా కూడా ఎలాంటి ప్రచారం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం. తేజోవతి మాట్లాడుతూ భగత్ సింగ్ కలలుగన్న సమాజం నేటికి కూడా రాలేదని, విద్యార్థులు యువకులు ప్రజలందరూ కూడా భగత్ సింగ్ కోరుకున్న సమాజాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని తెలియజేశారు… అలాగే ఈరోజు స్వాతంత్రం అనేది కొద్దిమంది పెట్టుబడిదారులకు మాత్రమే వచ్చిందని సామాన్య, పేద మధ్యతరగతి ప్రజలకు ఈ స్వాతంత్య్రం రాలేదని చెప్పారు… పేద మధ్యతరగతి ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రం రావాలంటే భగత్ సింగ్ కలలుగన్న నూతనమైన సమసమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని అన్నారు.ఈ కార్యక్రమంలో AIDYO సభ్యులు సక్రప్ప అధ్యక్షత వహించారు… AIDSO సభ్యులు భార్గవ్, వెంకటేష్, భరత్, బాలకృష్ణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.