ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి
1 min read
కుందేరు, న్యూస్ నేడు : భారతదేశ మాజీ ఉప ప్రధాని డా: బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కుందేరు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా దళితసంక్షేమసంఘం ఉమ్మడి కృష్ణజిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చిన్ననాటి నుండే అంటరానితనం ఎదుర్కొని బడుగు బలహీన వర్గాలకు సమాజంలో అన్ని హక్కులు కావాలని పోరాడినటువంటి వ్యక్తిగా అలాగే కేంద్రంలో అనేక శాఖలలో కేంద్రమంత్రిగా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా తన జీవితంలో ఓటమి ఎరుగని పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన చరిత్ర తనది అని, వెనుక బడిన వర్గాలకు ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన ఘనత ఆ సమతముర్తికే దక్కింది అని దేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండగా పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కు విముక్తి ప్రసాదించిన యోధుడు అని వ్యవసాయ, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్, రైల్వే, ఇలా ఎన్నో శాఖలకు మంత్రిగా సేవలు అందించి దేశానికి ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సేవలు దేశానికి అందించిన దీర్ఘదర్శి అని కొనియాడారు అలాంటి మహనీయుని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని ఆయన బాటలో పయనిస్తు ముందుకు కొనసాగుతాము అని తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక నాయకులు, రావెళ్ళ సంపత్,దేవరపల్లి కోటేస్వారావు ,పాతూరి శరత్, మట్ట చిట్టిబాబుదేవరపల్లి నక్షత్ర కుమార్ వల్లూరి ఏసురత్నం , దేవరపల్లి యశస్వి గ్రామస్థులు పాల్గొన్నారు.