ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
1 min read
పత్తికొండ జనసేన పార్టీ ప్రాంతీయ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పత్తికొండ సమన్వయకర్త రాజశేఖర్ ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర సంక్షేమం,ప్రజా శ్రేయస్సు కోసం అవతరించిన పార్టీ జనసేనపార్టీ అని అన్నారు.ముందుగా కార్యాలయం దగ్గర జండాను ఆవిష్కరణ గావించి, కేకును కట్ చేశారు. జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపేరునా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఎదురు తిరిగితే బతుకుతామా అనుకునే సామాన్యులకు ప్రశ్నించే దైర్యం, ప్రశ్నించడానికి జనసేన పార్టీ అనే ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చి, మన లాంటి కొన్ని లక్షల మంది యువతను రాజకీయాలులోకి వచ్చే విధంగా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందన్నారు. రాజకీయమంటే దోచుకోవడం దాచుకోవడం కాదు.సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాలునీ ఎదిరించి, ప్రజలకు అందవలసిన హక్కులను నిష్పక్షపాతంగా, నిస్వార్ధంగా వాళ్లకు అందే విధంగా పనిచేయడం అని అన్నారు.ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని, నిజాయితీగా సమాజ సేవ కోసమే రాజకీయాలు చేయాలని, సరికొత్త రాజకీయ విధానాన్ని తీసుకువచ్చిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర సంక్షేమం ప్రజాశ్రేయస్సు ప్రజల పక్షాన బలంగా నిలబడడానికి ఏర్పడిన పార్టీనే జనసేన పార్టీ అని, పార్టీ అవిర్భవించి ఒక దశాబ్దం పూర్తి ఔతుందని, ఈ 10సంవత్సారాల కాలంలో అనేక ప్రజా పోరాటాలు , సేవా కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల మన్నలను పొందుతున్న పార్టీ జనసేన పార్టీ అని అన్నారు.