12 మంది …తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి
1 min read– ఇతర జిల్లాల నుంచి కూడా తల సేమియా వ్యాధిగ్రస్తులు రాక
– స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి వ్యాదిగ్రస్తులను ఆదుకోవాలి
– జిల్లా చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్, ఏలూరు : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 12 మంది తలసీమియా వ్యాధి చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మన జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా తల సేమియా వ్యాధి పిల్లలు రక్తమార్పిడిని చేయించుకోవడానికి రెడ్ క్రాస్ భవనానికి వస్తున్నారని, వారందరికీ కూడా తగిన రక్త యూనిట్లను సమకూర్చడం కష్టతరమవుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరివిరిగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తల సేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. ఈరోజు తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 30 మందికి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత విశ్రాంత ఉపాధ్యాయుని నాగుల బేబీ సరోజినీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ , డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాదరావు, మానవత సభ్యులు కడియాల కృష్ణారావు, కోనేరు రవీంద్ర, ఎన్ బేబీ సరోజినీ, పైడి కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.