సముద్ర గర్భంలోకి 12 నగరాలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : కాలుష్యం వల్ల కరిగే మంచు వల్ల సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నాసా వెల్లడించింది. కర్బన ఉద్గారాలు, కాలుష్యాన్ని నివారించకపోతే భారత్ కు ముప్పు తప్పదని హెచ్చరించింది. 2100 సంవత్సరం నాటికి భారత్ లోని 12 నగరాలు మునిగిపోనున్నాయంటూ నాసా నివేదికలో తెలిపింది. విశాఖ సహా 12 నగరాలు సముద్ర గర్భంలోకి కలిసిపోతాయన్నది నివేదిక సారాంశం. ఈ నివేదిక ప్రకారం 79 ఏళ్ల తర్వాత తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. కర్బన ఉద్గారాలు, కాలుష్యాన్ని నివారించకపోతే ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీల సెల్సియస్ పెరగుతాయని నాసా తెలిపింది.