PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో డ్రైవ‌ర్ కు 12 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేర‌ళ‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ పీఆర్ జ‌య‌ప‌ళ‌న్ ను అదృష్టం వ‌రించింది. ఓనం బంప‌ర్ లాట‌రీ ఫ‌లితాల్లో 12 కోట్లు ల‌భించాయి. లాట‌రీ టికెట్ టీఈ-645465 బ‌హుమ‌తికి ఎంపికైంది. ఈ టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి కోచి స‌మీపంలోని మ‌రాడుకు చెందిన ఆటో డ్రైవ‌ర్ పీఆర్ జ‌య‌ప‌ళ‌న్ అని వెల్లడైంది. టికెట్ ను సెప్టంబ‌ర్ 10న కొనుగోలు చేశాన‌ని, ఈ టికెట్ కు బ‌హుమ‌తి వ‌స్తుంద‌ని ముందే భావించాన‌ని జ‌య‌ప‌ళ‌న్ విలేక‌రుల‌కు చెప్పారు. 12 కోట్ల బ‌హుమ‌తిలో అన్ని ప‌న్నులు మిన‌హాయించ‌గా 7 కోట్లు అత‌నికి మిగులుతాయి.

About Author