NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12 వేల మంది బ్యాచిలర్లను ఖాళీ చేయించారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కువైట్ లోని బ్నీద్ అల్ గర్ ప్రాంతం నుంచి 12 వేల మంది బ్యాచిలర్లను ఖాళీ చేయించారు. గత 16 నెలల్లో ఏకంగా 12వేల మందికి పైగా బ్యాచిలర్లను ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించినట్లు మున్సిపాలిటీ హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ బృందం-క్యాపిటల్ గవర్నరేట్ మున్సిపాలిటీ బ్రాంచీ జైద్ అల్ ఎనాజీ వెల్లడించారు. వీరంతా కొంతకాలంగా మున్సిపాలిటీ నిబంధనలను ఉల్లంఘించి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఇక 16 నెలల్లో 12వేల మందికి పైగా అంటే నెలకు సగటున 750 మంది. రోజువారీగా చూసుకుంటే 25 మంది బ్యాచిలర్లను ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. అలాగే వీరికి ఇళ్లను అద్దెకు ఇచ్చిన 220 భవన యజమానులపై పలు ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు.

              

About Author