PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుంటూరు జిల్లాలో 12మంది వీఆర్వోల సస్పెండ్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, గుంటూరు: జిల్లాలోని పలు మండలాల్లోని సచివాలయాల్లో పనిచేస్తోన్న 12మంది వీఆర్వోలను సస్పెండ్​ చేస్తూ కలెక్టర్​ వివేక్​యాదవ్​ ఉత్తర్వలు జారీ చేశారు. అలాగే 13మంది తహసిల్దార్లకు సైతం షోకాజ్​ నోటీసులు పంపారు. ఇటీవల కాలంగా ఆయా తహసిల్దార్​ కార్యాలయాల పరిధుల్లో రెవెన్యూ సేవల నిమిత్తం వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అటు తహసిల్దారుల, ఇటు వీఆర్వోలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తుండడంతో కలెక్టర్​ కన్నెర చేశారు. పలుమార్లు జాయింట్​ కలెక్టర్లు సచివాలయాల తనిఖీ సమయాల్లోనూ, అలాగే టెలీ, వీడియో కాన్ఫరెన్సుల్లోనూ ఆయా తహసిల్దార్లు, వీఆర్వోలను ప్రజా దరఖాస్తులకు సంబంధించిన అంశాల పరిష్కారంపై హెచ్చరించినా పెడచెవిన పెట్టడడంతో జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు షోకాజ్​ నోటీసులు అందుకున్న తహసిల్దార్లలో గుంటూరు తూర్పు, పడమ, అచ్చంపేట, నత్తెనపల్లి, రెంటచింతల, దాచేపల్లి, కారంపూడి, ఈపూరు, నకరికల్లు, యడ్లపాడు, బాపట్ల, తెనాలి, పొన్నూరు మండలాల తహసిల్దార్లు ఉన్నారు. అలాగే సస్పెండ్​ అయిన వారిలో అచ్చంపేట, వేల్పూరు, పొత్తూరు, ఒప్పిచర్ల 1, 2, గంగవరం, వనికుంట, నాదెండ్ల 1, రెమిడిచర్ల, పెదపులివరు, గార్లపాడు, పెదపాలెం వీఆర్వోలు ఉన్నారు.

About Author