గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
1 min read
పల్లెవెలుగువెబ్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. మోర్బిలోని జిన్‌గూడ గ్రామంలో తాజాగా 120 కిలోల హెరాయిన్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హరీష్ సంఘ్వీ అధికారికంగా వెల్లడించారు. దీని విలువ వేల కోట్లలో ఉంటుందని తెలిపారు. కాగా, ఇటీవల గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో 3 వేల కిలోల హెరాయిన్‌ను పట్టుబడిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.21వేల కోట్ల పైమాటే.