పప్పూరు రామాచార్యులు 127 వ జయంతి
1 min read– పప్పూరి రామాచార్యులు ఆశయాల సాధనకు పోరాడుతాం
– రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో పప్పూరు రామాచార్యులు 127 వ జయంతి నిర్వహణ.
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకా లోని ఎంపీడీఓ కార్యక్రమంలో ఆర్. వి. పి. యస్ తాలూకా అధ్యక్షులు సుంకన్న ఆధ్వర్యంలో కీ.శే పప్పు రామాచార్యుల 127 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్. వి. పి. యస్.కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకొమ్మ అశోక్ హాజరై కీ.శే పప్పూరి రామాచార్యుల చిత్రపటానికి పూలమాలేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, రాయలసీమ ఉద్యమకారుడు 1932 లో సహాయనిరాకరణోద్యమం,1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోని జైలు జీవితం గడిపారన్నారు.రాయలసీమ కోసమే 1926 అగష్టు 14 న శ్రీ సాధన పత్రికను స్థాపించి ఆపత్రికకు టాగ్లైన్ వాయిస్ ఆఫ్ ది రాయలసీమ అనే పేరుతో రాయలసీమ హక్కుల గళం వినిపించారని అన్నారు.1937 నవంబర్ 16 శ్రీబాగ్ ఒప్పందం సృష్టికర్త పప్పు రామాచార్యులు జయంతి వర్ధంతి వేడుకలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.వారి ఆశయాలకోసం పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్, ఎంపీడీఓ కార్యాలయం టైపిస్ట్ లక్ష్మీరెడ్డి,వంశీ, నానీ,మురళి తదితరులు పాల్గొన్నారు.