13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
1 min readఆరుగురి అరెస్టు.. ఒకరు పరారీ
– వివరాలు వెల్లడించిన ఎస్ఐ రాంమోహన్ రెడ్డి
పల్లెవెలుగు, రుద్రవరం: మండలంలోని నర్సాపురం గ్రామంలో ఓ కళ్లెంలో దాచిన 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనంచేసుకుని.. ఆరుగురి ముద్దాయిలను అరెస్టు చేసినట్లు రుద్రవరం ఎస్ఐ రాంమోహన్ రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంగ నరసింహుడు అనే వ్యక్తి కళ్లెంలో ఎర్రచందనం దాచి ఉంచినట్లు రెడ్ శాండిల్ టాస్క్ఫోర్స్ డి ఎస్ పి కి సమాచారం రావడంతో..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి కళ్లెంలో సోదా నిర్వహించగా 13 దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆరా తీయగా.. గ్రామానికి చెందిన చింతల పెద్ద ఓబులేసు , గుర్రం రాముడు , జల్లా దావీదు , బోయ పెద్ద వెంకటేశ్వర్లు ఉరఫ్ మూగెన్న , గుర్రం ప్రసాదు , చిత్తగాళ్ళ ఓబులేసు అనే వ్యక్తులు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
ఆరుగురి ముద్దాయిలను అదుపులోకి తీసుకొని విచారించగా అదే గ్రామానికి చెందిన పంగా నరసింహుడు అనే వ్యక్తి ఎర్రచందనం దుంగలు తెమ్మని రూ.30 వేల అడ్వాన్సు ఇవ్వడంతో అటవీ ప్రాంతం నుండి తీసుకొచ్చినట్లు వారు అంగీకరించారు. ఆరుగురిని అరెస్టు చేయగా మరో ముద్దాయి పంగ నరసింహుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్ఐ రాంమోహన్ రెడ్డి పేర్కొన్నారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్, అటవీ, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.