ఘనంగా133వ అంబేద్కర్ జయంతి వేడుకలు : ఎస్ఎఫ్ఐ… సిఐటియు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: నంద్యాల జిల్లా పాణ్యం లో డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా… ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణము లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి బత్తిని ప్రతాప్, సీఐటీయూ మండలం నాయకుడు భాస్కర్, మాలమహానాడు జిల్లా నాయకుడు దేవాదత్తు, ఏ ఐ ఎఫ్ బి జిల్లా నాయకుడు వనం వెంకటాద్రి మాట్లాడుతూ అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాలైనా నేటికి భారతదేశంలో ఆయన రాసిన రాజ్యాంగం పూర్తిగా అమలు కావడం లేదని అసమానతలు అంటరానితనం సమాజంలో కొనసాగుతున్నాయని దళితులు బీసీలు మైనార్టీలు పై దాడులు జరుగుతున్నాయని చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ దామాషా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఉన్నత వర్గాలకే సీట్లు ఎక్కువ కేటాయిస్తున్నారని దీని బట్టి రాజ్యాంగం ఎక్కడ పూర్తిగా అమలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని అనేకమంది మహిళలు హత్యలకు గురి అవుతున్నారని స్త్రీ పురుష భేదం లేకుండాఉన్నప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి స్ఫూర్తినిస్తుందని రాజ్యాంగ అమలు సాధనకై కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ ఉద్యమాలలో రైతులు కార్మికులు, మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.