మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి..
1 min readపల్లెవెలుగు వెబ్ హోళగుంద : మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమం ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద మండలం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమం చేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అమానుల్లా మాట్లాడుతూ . . ఏప్రిల్ 11 1827న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు గోవిందరావు ఆయన పూల వ్యాపారి 1834 నుండి 38 కాలంలో పోలే మరాఠీ స్కూల్లో చదువుకున్నాడు. కానీ అగ్రవర్ణాల వారు మాత్రమే చదువుకోవాలని. అంటరానితనం బడుగు బలహీన వర్గాల వారు అగ్రవర్ణాల వారికి సేవ చేయాలి అని బ్రాహ్మణులు చెప్పేవారు. బడుగు బలహీన వర్గాల కోసం సొంత నిధులతో పాఠశాలలను తెరిచి ఆ పాఠశాలలో నిమ్నజాతి వారు తక్కువ కులస్తులు అని లేకుండా అంటారనితనం లేకుండా పాఠశాలలను తెరిచి అందరూ సమానంగా చదువుకుని అంటరానితనాన్ని నిషేధించాలని జ్యోతిరావు పూలే చేసిన కృషి ఎనలేనిది.ఆ సమయంలో స్కూల్ కట్టడానికి ముస్లింలు మాత్రమే సహకరించడం జరిగింది అంటే ముస్లింలయితేమీ హిందువులయితేమీ అగ్ర కులాలు వారైతే ఏమి నిమ్న కులాల అయితే ఏమి అందరు సమానమని మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ తెలియజేయడమైనది ఆయన ఆత్మకి శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించడమైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులైన హరిజన పరసప్ప మైనారిటీ సీనియర్ నాయకులైన పీరా సాబ్. బోయ సిద్ధప్ప బోయ రామదాసు బోయ కళాప బోయ రామారావు చాకలి శేఖర్. రాజా సాబ్ డ్రైవర్ అమన్. జఫ్రూళ్ళ అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.