PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ 134వ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మొట్టమొదటి భారత ప్రధాని గౌరవనీయులు దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ  134వ జయంతి కార్యక్రమం ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. అమానుల్లా ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయంతి కార్యక్రమం జరపడం జరిగింది. జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారు. ఈయన తండ్రి మోతిలాల్ నెహ్రూ. నెహ్రూ ది సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణులు కుటుంబం. నెహ్రూ తండ్రి మోతిలాల్ నెహ్రూ అప్పట్లో పేరు మోసిన లాయరు. మామూలుగా మనదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచే వచ్చినవారు. కానీ నెహ్రూ మాత్రం మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినారు. నెహ్రూ  బాల్యమంతా ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకు విద్యను నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మాస్టారు ఇంటికి వచ్చి చెప్పేవారు. ఆ తర్వాత ఆయన తన ఉన్నత విద్యా కోసం ఇంగ్లాండ్ కు వెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువు కొనసాగించారు. ఆ తర్వాత నెహ్రూ  వివాహం 1916న సంవత్సరం ఫిబ్రవరి 8న ఢిల్లీలో ఓ మంచి సంపన్న కుటుంబంలో జన్మించిన కమల నెహ్రూ తో వివాహం అయింది. ఆ తర్వాత నెహ్రూ  అనిబిసెంట్  మాట ల వలన ప్రభావితులై స్వాతంత్ర సంగ్రమంలో పాల్గొన్నారు. జలియన్వాలాబాగ్ ల డయ్యర్ జరిపిన హెచ్చరిక లేని కాల్పుల వలన వేలాదిమంది అమాయక ప్రజలు మరణించడం గాయపడడం జరిగింది. ఈ సంఘటన తర్వాత గాంధీజీతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని దేశ స్వాతంత్రం కోసం కారాగార శిక్ష అనుభవించి దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కి శ్రీమతి ఇందిరాగాంధీ ఒకే ఒక కూతురు జన్మించడం జరిగింది కానీ ఆమె బాల్య జీవితం నెహ్రూ  చూడడం లేదు ఎందుకంటే ఆయన ఎక్కువ జైల్లోనే జీవితం గడిపినారు. అందుకే నవంబర్ 14న నెహ్రూ కి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే పిల్లలు అందరూ చాచా బాయ్ నెహ్రూ అని పిలవడం జరిగింది. ఆయన పుట్టినరోజు నవంబర్ 14న బాలల దినోత్సవం గా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో బోయ వీరేష్ బోయ నాగప్ప చాకలి శేఖర్. ఖలీల్ ‌ హరిజన పరసప్ప. బోయ సుధాకర్. వీరేష్. ఇజాజ్ అనేకమంది కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు నెహ్రూ గారి జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది.

About Author